Monday, October 10, 2016

ఉయ్యాల!.. జంపాల!...

చంటిపిల్లలకు ఉయ్యాల అంటే భలే ఇష్టం కదా?! 

మా గడుగ్గాయికి ఇష్టమే! కానీ దాన్ని ఊపడానికి మనిషి కావాలి  :)

మరి ఎవరో ఒకరు ఊపందే ఉయ్యాల ఎలా ఊగుతుందా అనా ? ఈమధ్య ఆ ఆటోమాటిక్ ఉయ్యాలలు వచ్చాయిగా!? స్విచ్ వేస్తె , కావాల్సిన స్పీడ్ పెట్టుకుంటే... ఎంచక్కాఅవే  హాయిగా 'లాలాలా .... లాలాలా ...' అని పాటలు పాడుతూ , ఆటలు ఆడిస్తూ మరీ నిద్రపుచ్చుతాయ్!

అటువంటి ఉయ్యాల, కష్టపడి వెతికి పట్టి , కొనిపెట్టి,దాన్ని నానా తంటాలుపడి ఫిక్స్ చేసి, మావాడికి 'ఊగరా ఊగరా ఉయ్యాలా ' అని ఇస్తే.. అబ్బే! మనకి అమ్మ-నాన్నని  అంత తేలిగ్గా పోనిస్తే ఎలా?



మొదటి రోజు:
రోహన్ : అర్రే ! ఇదేంటి? అటు ఇటు తెగ తిప్పేస్తోంది? నాకు నచ్చింది . అమ్మకి ఒక స్మైల్ పడేద్దాం!
అమ్మ : అబ్బ! నా కన్నయ్యకి నచ్చిందోచ్ ! హమ్మయ్య చందూ .... మనం హ్యాప్పీస్... :)


రెండవ రోజు:
రోహన్ : ఏంటి! మళ్ళీ దీంట్లో పడేసారు? రోజు ఇదేనా? ... సరేలే... ఊరికే ఏడుద్దాం ఒకసారి 
అమ్మ : అర్రే! బంగారం... ఎందుకమ్మా ఏడుపు? పాటలు వింటావా?
రోహన్: అలా రా దారికి. సరే పెట్టు చూద్దాం. 
ఉయ్యాల: లాలాలా .....లాలాల... లాల్లా 
రోహన్:  ఈ ఉయ్యాల ఏంటి పాటలు కూడా పడుతుందా? Not Bad! సరేలే... ఒక నవ్వు నవ్వుదాం . పాపం మమ్మీ హ్యాప్పీస్ .  :)
అమ్మ : నా బంగారానికి పాటలంటే ఎంతిష్టమో ? కిలకిలా నవ్వేస్తోంది . ఈ ఉయ్యాల ఎంత బాగుందబ్బా ?

మూడవ రోజు:
రోహన్ : వార్నీ! ఈ ఉయ్యాల  ఇంకా ఉందా? ఓహో రోజు ఇందులో కాసేపు  ఊగాలా?  నన్ను ఇందులో పడేసి , ఆ సుత్తి పాటలు పెట్టి అమ్మ హాయిగా మంచం మీద బబ్బుంటుందా? No way! ఏడుద్దాం!
అమ్మ: అరేయ్! ఏమైంది రా? నిన్న బానే ఉన్నావుగా? నిద్రొస్తోంది నాన్నా ! ప్లీస్ 
రోహన్ : No . No .  నేను పడుకోకుండా మీరు పడుకోడమే ? Never! గట్టిగా ఏడుద్దాం. 
అమ్మ: అరేయ్ !!!! అర్ధరాత్రి ఈ మద్దెల దరువేంట్రా? 
రోహన్ : హ్హహ్హహహహ్(లోపల), కేర్..కేర్..కేర్ (బైట)

దండనక మొదలు  ..... 

నాల్గవ రోజు :
రోహన్ : నిన్న అంత వార్నింగ్ ఇచ్చినా అమ్మ నా మాట వినట్లేదు .ఏదో ఒకటి చేయాల్సిందే! (కేర్ ...కేర్... కేర్ )
అమ్మ: అరేయ్ , నీకు ఆ పిచ్చి పాటలు నచ్చకపోతే పర్లే , నేను పాడతా !  'రామా లాలీ ... మేఘశ్యామలాలి'
రోహన్ : ఇదేదో బాగుంది. అమ్మకి పని. మనకి హాపీ. ఒక స్మైల్ పడేద్దాం :)
అమ్మ: నా కన్నయ్యకి నా పాటంటేనే ఇష్టం! నా చిట్టితండ్రి ! :)

గంట అయింది. 
రెండు గంటలయ్యాయి ..... 

అమ్మ: అరేయ్ ! పడుకోరా ?
రోహన్: రేపు పొద్దున్న పడుకుంటా .నువ్వు  ముందు పాడు .నీకసలే శ్రోతలు తక్కువ, నాకు పాటగాళ్లు ఎక్కువ! 
అమ్మ: రోహన్...  ప్లీజ్ రా . 
రోహన్: సరే! ఊరికే అలా ఊపుతూ ఉండు. చాలు. పాడకు . ఆ రామలాలి వినివిని బోర్ కొట్టేసింది. 
అమ్మ: చేతులునొప్పెడుతున్నాయ్  పడుకోరా !
రోహన్: నోరు నొప్పి పుట్టక , చేతులు నొప్పి పుట్టక , నేనెలా పడుకునేది? నువ్వైనా చెప్పు? 
అమ్మ: అరెయ్య్!!!

ఐదవరోజు:

నాన్న : అరేయ్ .... రోజు అమ్మని ఏడిపిస్తున్నావ్! ఇవాళ నేను పడుకోబెడతా నిన్ను. 
రోహన్ : అమ్మ వల్లే కాలేదు . పిచ్చి నాన్న!
నాన్న: ఈ పాటలు విను. హాయిగా ఊగుతూ ఉండు. అదే నిద్ర పట్టేస్తుంది . సరేనా!
రోహన్ : అబ్బా! ఛా ! మరి తమరేం చేస్తారో?? హాయిగా కునుకు తీద్దామనే ? మన తడాఖా  చూపిద్దాం! (కేర్... కేర్.. )
నాన్న: చూడు! నేనసలు మంచోడని కాదు. కళ్ళు మూసుకుని పడుకో . 
రోహన్: నేను నీ నెక్స్ట్ వెర్షన్ నాన్న . అస్సలు పడుకోను . (కెవ్వ్వ్వ్వ్వ్ .......కెవ్వ్వ్వ్ )
నాన్న: ఆ ఏడుపేంట్రా ? ప్లీస్ రా. అమ్మ పడుకుంది. లేస్తే నిన్ను, నన్నుఇద్దరినీ  చితకేస్తుంది 
రోహన్:  ఐతే ఏంటి? (సీరియస్ లుక్)
నాన్న: ఆ చూపేంట్రా ? అరేయ్ నీకు నెలన్నర వయసు.  నీ వయసుకి తగ్గట్టు ఉండరా . 
రోహన్ : అయితే మర్యాదగా నన్ను ఎత్తుకొని , అటు ఇటు తిప్పి, లాలి పాడి బజ్జోపెట్టు. అది కూడా అమ్మ పక్కన. సరేనా? 
నాన్న: సరే రారా! నిన్ను ఎత్తుకుని తిప్పుతా !అప్పుడన్నా పడుకుంటావేమో !
రోహన్: అద్దీ ! అలా రా దారికి. హమ్మా!!


ఆరవ రోజు:
ఇందు: చందు.. ఈ ఉయ్యాలా తీసేద్దాం! ఎందుకు పనికిరాని చెత్త ఉయ్యాల. 
చందు : ఉయ్యాల మంచిదే! నీ కొడుకే... తేడా! అయ్యగారు నరవాహనం మరిగారు. ఈ ఉయ్యాలలు, జంపాలాలు ఏం  పనికొస్తాయ్ ? వెధవన్నర వెధవ!
ఇందు : తమరి పోలికలే వచ్చాయి మరి. ఏమిచేస్తాం !(మనసులో గొణుగుతూ )

అలా...వారం రోజులకి  ఆ ఉయ్యాల అటకెక్కింది . 

12 comments:

  1. హహహహ్.... మీరు ఏ భాష లో మాటాడుకునేవారు??
    నరవాహనం....ఇది అరాచకమ్

    ReplyDelete
    Replies
    1. రోహన్ భాష! :P ముఖకవళికలతోనే అన్ని భాషలు మాట్లాడేస్తాడు ;) హ్హహ్హ! థాంక్స్ రాజ్ :)

      Delete
  2. వావ్ సూపర్ ఇందు మరిన్ని కబుర్లు వినడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా :-)

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ వేణు! తప్పకుండా ప్రయత్నిస్తా :)

      Delete
  3. హ్హ హ్హ బాగుంది ☺
    రాధిక (నాని)

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ రాధికగారు :)

      Delete
  4. హహ్హహ్హా... అలా కళ్ళముందు కనిపించేసింది వీడియోలాగా.. రోహన్ ని నిద్రపుచ్చడానికి మీరు పడిన తంటాలు. :-)

    ReplyDelete
    Replies
    1. అవును! అది ఎప్పటికి గుర్తుండిపోయే రక్త కన్నీరు Phase :P

      Delete