ఆరోజు..
బాలల దినోత్సవం! శుక్రవారం...
అప్పటికే నన్ను ముప్పు తిప్పలు పెట్టి , మూడు సార్లు హాస్పిటల్ లో మాక్ రన్ చేయించిన నా బుజ్జాయి... కేర్ కేర్ మంటూ ఈ భూమ్మీద అడుగుపెట్టిన రోజు... మావాడి పుట్టినరోజు.
మా మావగారు మళ్ళీ పుట్టారు అన్నారు అందరు.. నెహ్రు అంతటివాడు అవుతాడన్నారు కొందరు . మఖా నక్షత్రం, సింహ రాశి .... ఇంట్లో అందరు సింహాలే ఇందు తప్ప .... అదీ ఇదీ అని ఒకటే గోల!
ఇవేమి పట్టట్లేదు నాకు .... మావాడిని మొదటిసారి చూసినప్పుడు ఒక చిన్న గులాబీ రేకు విచ్చుకున్న అనుభూతి. ఆ పూవు రెక్కలు విప్పి ఈ లోకాన్ని తీరిగ్గా పరికిస్తున్న అనుభూతి .... పెద్దపెద్ద కళ్ళతో నన్ను ఆశ్చర్యంగా చూసిన మొదటి చూపు... మా ఇద్దరి చూపులు కలిసిన క్షణం .... ఆహా ! ఎప్పటికి మర్చిపోలేను నాకు అల్జీమర్స్ వచ్చినాసరే!
'హలో బేబీ!' అని మాత్రం అనగలిగాను నా చూపుడువేలిని వాడి సుతిమెత్తని బుగ్గకి తాకిస్తూ... (జావాలో 'హలొ వరల్డ్ ! ' ప్రోగ్రామ్ రాసిన ఎక్స్పీఎరియన్స్ అనుకుంటా ;) )
ఒత్తైన జుట్టు , పల్చటి ఎర్రని పెదాలు , పెద్ద పెద్ద కళ్ళు (ఆ మొహంలో కళ్ళు తప్ప ఏవి కనిపించేవి కాదు మొదట్లో ), కుదురైన ముక్కు (ఎంతమంది వంకలు పెట్టినా సరే... ), పొడుగాటి గోళ్లు .. కలగలిసి ఒక బుజ్జి పాపాయి . అచ్చమ్ నా చిన్ని కృష్ణుడే మళ్ళీ పుట్టాడు అనిపించింది .
మావాడికి పేరు పెట్టేసేయాలి రెండు రోజుల్లో అని చెప్పారు . తొమ్మిది నెలలు అన్ని పేర్ల పుస్తకాలు, విష్ణు సహస్రనామాలు, వెబ్సైట్లు జల్లెడపట్టాక ... ఫైనలైజ్ చేసుకున్నవి ఏమిటనగా ....
'కృష్ణ తేజ్' వాడికి మొదట అనుకున్న పేరు .
'అర్జున్' నాకు ఇష్టమైన పేరు.
'ప్రణవ్' నచ్చిన పేరు
'కృష్ణ తేజ్' ...'రా.చ తేజ్ ' లాగ ఉందని నాకు నచ్చలేదు.
పూర్వాశ్రమంలో , చందుగారింట్లో కుక్క పేరు 'అర్జున్'. ప్చ్! ఈ పేరు పెట్టలేను
'ప్రణవ్ ' అంటే.. పవన్ కళ్యాణ్ దయవల్ల నాకు బ్రహ్మానందం గుర్తొచ్చాడు(ప్రణవ్... ది హెడ్ కానిస్టేబుల్ ) . ఇదీ పెట్టలేను.
అందువల్ల మా వాడికి పేర్లకి కరువొచ్చింది.
రోహిణి నక్షత్రం రోజున పుడితే అమ్మాయి అయితే రోహిణి అని పెట్టొచ్చు .. మరి అబ్బాయి ఐతే? అని చందు కి డౌట్ వచ్చింది . 'రోహన్' అని పెడతాం అనుకున్నాం. నవ్వుకున్నాం.
కానీ, మావాడు రోహిణి నక్షత్రం రోజున కూడా బైటికి రాకుండా మారాం చేసాడు. సో! ఆ పేరు పక్కన పెట్టాం .
మఖ నక్షత్రం రోజున పుట్టాడు ... మఖేష్ అని పెట్టలేం కదా? మరీ ఛండాలంగా ఉంది . అసలే ముఖేష్ దయవల్ల ఆ పేరు కామెడీ అయ్యింది.
ఇంకేంటి దారి? ఇంకేం పేర్లు లెవా?
రెండు రోజులు బుర్రలు బద్దలు కొట్టుకున్నాక, ఇక లాభం లేదనుకుని , ఇదేదో బానే ఉంది ... రోహిణి అయినా , కాకాపోయినా .... పెట్టేద్దాం అని 'రోహన్' కి ఫిక్స్ అయ్యాము!
అలా మావాడు రోహన్ అయ్యాడు .... ఈ బ్లాగు రోహనీయం అయ్యింది.
ముద్దుగారే ఇందు ముంగిట ముత్యం వీడు....
తిద్దరాని మహిమల....చందు సుతుడూ ...
-రోహన్ గారి అమ్మ (ఇందు)